Magazines

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కలకలం

18 అక్టోబర్, 2026

Bollywood actor Tiger Shroff
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై కాల్పుల ఘటన ముంబైలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆదివారం సాయంత్రం జుహు ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, అయితే ఆయన డ్రైవర్ గాయపడ్డారని ముంబై పోలీసులు ధ్రువీకరించారు.


వివరాల్లోకి వెళితే.. జుహు పోలీస్ స్టేషన్ పరిధిలోని పుష్పా పార్క్ సమీపంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కారును లక్ష్యంగా చేసుకుని మూడు నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా ఉండగా, ఆయన కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నానావతి ఆస్పత్రికి తరలించారు.


ఘటన గురించి తెలియగానే ముంబై పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. డీసీపీ మోహిత్ గార్గ్ సహా ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. టైగర్ ష్రాఫ్ సురక్షితంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. దుండగులను పట్టుకోవడానికి పోలీసులు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.


ఇదిలా ఉండగా, ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు విదేశాల్లో ఉంటున్న గ్యాంగ్‌స్టర్లు అనిల్ పండిట్, హర్మన్ సంధులు సోషల్ మీడియాలో ప్రకటించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరఫున ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్