నవతెలంగాణ - హైదరాబాద్ : రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.0 తీవ్రత నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. విల్యూచిన్స్క్ నగరానికి నైరుతి దిశగా 123 కిలోమీటర్ల దూరంలో, 140 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
రష్యాలో భారీ భూకంపం.. తీవ్రత 7.0
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)