Magazines

రెండో టీ20లో భారత్ త్రిల్లింగ్ విక్టరీ

1 గంట క్రితం

thilka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి ఉత్కంఠ పోరులో భారత్ గెలిచింది. నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై ఇండియా విక్టరీ సాధించింది. తొలి 20లో నమన్ ధీర్ గెలిపించగా, రెండో మ్యాచ్ లో తిలక్ వర్మ ఇండియాను గెలిపించారు.


అంతకుముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది కివీస్. కివీస్ బ్యాట‌ర్లలో గ్లెన్ ఫిలిప్స్ (70), బెవాన్ జాకబ్స్ (56) హాఫ్ సెంచరీలతో కదంతొక్కరు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 33 పరుగులిచ్చి రెండు వికెట్లతో సత్తా చాటాడు. భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.


ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన టీమిండియా తిలక్ వర్మ(51) అర్ధ సెంచరీతో కదంతొక్కాడు. నమన్ ధీర్ 31, నితిష్ 26, అభిషేక్ 27 పరుగులతో తొడ్పాటును అందించారు. సంజు 14, కిషాన్ స్థానంలో జట్టులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ అయ్యర్ 7, అక్షర్ 11 స్వల్ప పరుగులకే నిరాశపరిచారు. కివీస్ బౌలర్లు శాంట్నర్ నాలుగు వికెట్లు తీయగా స్మిత్, ఢఫీ చెరో వికెట్ తీశాడు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్