నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ కీలక నిర్ణయం తీసుకుంది.ప్రధాన రకాల తాజా పౌచ్ పాల రిటైల్ ధరలను సుమారు 4 నుండి 5 శాతం వరకు పెంచింది. 3 శాతం పాల కొవ్వు కలిగిన అమూల్ తాజా టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ. 2 (3.3% పెరుగుదల), 6 శాతం పాల కొవ్వు కలిగిన అమూల్ గోల్డ్ మిల్క్ ధర లీటరుకు రూ. 4 (5.5% పెరుగుదల) చొప్పున పెంచింది. ఈ రేట్లు నవంబర్ 12 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పాడి వ్యవసాయ కార్యకలాపాలు, వాణిజ్య ప్రాసెసింగ్ ల్లో నిర్వహణ ఖర్చుల పెరుగుదల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.
పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ కీలక నిర్ణయం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)