హీరో, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా ‘మాయలేడి’. ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రశంకర్ దర్శకుడు. ఈ నెల 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు.
కో ప్రొడ్యూసర్ విజిత్ మాట్లాడుతూ, ‘ఈ కథ వింటున్నప్పుడు ఆద్యంతం ఎంటర్ టైన్ అయ్యాను. ఇదే ఎంటర్ టైన్ మెంట్ మీరు థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
‘ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడితే కథలోని ట్విస్ట్స్ రివీల్ అవుతాయి. అందుకే ట్రైలర్ లో కూడా ఇంద్రజ లాంటి ఆర్టిస్టులను రివీల్ చేయలేదు.
సినిమాలోని కొన్ని క్యారెక్టర్స్ ను మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు. స్క్రీన్ మీదే వారి క్యారెక్టర్స్ ను ఎంజాయ్ చేయాలి. రాకేష్ తన కెరీర్ లో ‘ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు’ వంటి డిఫరెంట్ మూవీస్ చేశారు. వాటికి కమర్షియల్ హంగులు జోడిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. హీరోయిన్ మధుమిత క్యారెక్టర్ లో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. అవన్నీ స్క్రీన్ ఆకట్టుకుంటాయి’ అని డైరెక్టర్ ప్రశంకర్ చెప్పారు.
హీరోయిన్ మధుమిత సర్కార్ మాట్లాడుతూ,‘ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. నా మొదటి సినిమాలోనే పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ లభించడం అదృష్టంగా భావిస్తున్నా.
ఈ సినిమాలో నా క్యారెక్టర్ లో వేరియేషన్స్ చూస్తారు’ అని తెలిపారు.
‘నేను ఈ సినిమా చేసేందుకు రెండు ప్రధాన కారణాల్లో ఒకటి స్క్రిప్ట్, రెండోది డైరెక్టర్ గా ప్రశంకర్ కు ఉన్న ప్యాషన్. మీ అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుంది. ఈ నెల 13 రిలీజ్ టఫ్ డేట్ అని తెలుసు. చాలా సినిమాలు ఆ తేదీన వస్తున్నాయి. నాపై అభిమానంతో మా డిస్ట్రిబ్యూటర్స్ ఈ డేట్ ఎందుకు అని కూడా చెప్పారు. స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే ఎన్ని సినిమాల మధ్యనైనా మా సినిమా ఆదరణ పొందుతుందని మేము నమ్మాం. అందుకే ఎక్కువ సినిమాలు రిలీజ్‌కి ఉన్నా ఈ నెల 13న విడుదల చేస్తున్నాం’ అని హీరో, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చెప్పారు.
కంటెంట్ మీద నమ్మకంతో చేశాం
17 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 11, 2026 | 2 నిమిషాల చదవడం




కామెంట్లు (0)