హీరో సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త చిత్రం ‘సిద్ధు10’లో సరికొత్త ప్రేమకథతో అలరించబోతున్నారు. తబిత సుకుమార్ సమర్పణలో, సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అన్మోల్ శర్మ, బన్నీ వాస్, అశోక్ బండ్రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో మోహన్ బి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘ఇడుపు కాయితం’ తర్వాత సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ కలిసి నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. ప్రముఖ కథా రచయిత సుకుమార్ టీమ్‌లో కీలకంగా ఉన్న మోహన్ బి.. ఈ సినిమా కోసం ఒక అందమైన, కొత్త తరహా ప్రేమకథను సిద్ధం చేశారు. సిద్ధుకు జోడీగా నయన్ సారిక హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో నేడు సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
దర్శకుడు సుకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ తొలి క్లాప్ కొట్టారు. నిర్మాతలు విశ్వప్రసాద్, బాపినీడు, దర్శకులు బుచ్చిబాబు, చందూ మొండేటి చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు. దర్శకులు హరీశ్ శంకర్, నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
సినిమా ప్రారంభోత్సవంతో పాటు ఆసక్తికరమైన థీమ్ పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
సిద్ధు జొన్నలగడ్డ, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం: మోహన్ బి, సమర్పణ: తబిత సుకుమార్, నిర్మాతలు: అన్మోల్ శర్మ, బన్నీ వాస్, అశోక్ బండ్రెడ్డి, సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ: చంద్రు సెల్వరాజ్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్.





కామెంట్లు (0)