నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి మస్కట్ మీదుగా హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికుడి వద్ద రూ.1.37 కోట్ల విలువైన 1,049.76 గ్రాముల విదేశీ బంగారాన్ని గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన అధికారులు ప్రయాణికుడి ట్రాలీ బ్యాగులోని వాలెట్లో దాచిన తొమ్మిది బంగారు బిస్కెట్లను గుర్తించారు. యూఏఈ మార్కింగ్‌తో ఉన్న 24 క్యారెట్ల బంగారానికి సరైన దిగుమతి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. విచారణలో విమానాశ్రయం వెలుపల మరో వ్యక్తికి బంగారం అప్పగించాల్సి ఉందని ప్రయాణికుడు వెల్లడించడంతో, బంగారం స్వీకరించేందుకు వచ్చిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ చట్టం-1962 ప్రకారం ఇద్దరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ఇతర వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.1.37 కోట్ల బంగారం పట్టివేత
20 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)