Magazines

రోడ్ల నిర్మాణంలో యువ ఇంజినీర్ల భాగస్వామ్యం పెరగాలి

12 నిమిషాల క్రితం

The participation of young engineers in road construction should increase.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

ఐఆర్‌‌సీ అధ్యక్షులు సీబీ. ఓజా పిలుపు

ముగిసిన 85వ వార్షిక సమావేశం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఆధునిక రోడ్ల నిర్మాణంలో యువ ఇంజినీర్ల భాగస్వామ్యం పెరగాలని ఇండియన్‌ ‌రోడ్‌ ‌కాంగ్రెస్‌ ‌నూతన అధ్యక్షులు సీబీ.ఓజా పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని హైటెక్‌‌లో నిర్వహించిన ఐఆర్‌‌సీ సదస్సు నాలుగో రోజు ముగింపు సమావేశాల అనంతరం ఏర్పాటు చేసిన 240వ కౌన్సిల్‌‌లో ఆయన మాట్లాడారు. అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, నూతనంగా రంగంలోకి వస్తున్న యువ నిపుణుల మధ్య విజ్ఞాన మార్పిడిని ప్రోత్సహించడం ద్వారా ఐఆర్‌సీ సాంకేతిక మార్గదర్శకాలు క్షేత్రస్థాయికి చేరి, రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత దోహదపడతాయని పేర్కొన్నారు. మారుతున్న సాంకేతిక, ఇంజినీరింగ్, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేయాలని అన్నారు. రోడ్ల ప్రణాళిక నుంచి నిర్మాణం, పర్యవేక్షణ, మరమ్మతుల వరకు రహదారి మౌలిక సదుపాయాల ప్రతి దశలోనూ ఐఆర్‌సీ ప్రమాణాలను ఎప్పటికప్పుడు సమీక్షించి ఆధునీకరించాలని సూచించారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రహదారుల రంగంలో వినియోగించుకోవాలని సూచించారు. ఐఆర్‌‌సీ తదుపరి వార్షిక సమావేశం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో నిర్వహించనున్నట్లు ఓజా వెల్లడించారు. ఐఆర్‌సీ 85వ వార్షిక సమావేశం విజయవంతానికి విశేష కృషి చేసిన తెలంగాణ రోడ్లు, భవనాల శాఖకు చెందిన సీనియర్ ఇంజినీర్లు, అధికారులను ఈ సందర్భంగా సదస్సు సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఐఆర్‌‌సీ ఉపాధ్యక్షులు బీఎస్. బఘేల్, సి.రవి శేఖర్, ఆర్తి భార్గవ, కార్యదర్శి జనరల్ రాహుల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్