నవతెలంగాణ-హైదరాబాద్:ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ 20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ బ్యాట్‌తో చెలరేగారు. ఆసీస్ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకాన్ని నమోదు చేశారు. తద్వారా ఆస్ట్రేలియాపై టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు.మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో నమోదైన అత్యంత వేగవంతమైన టీ20 అర్ధశతకాల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఈ మైదానంలో డేవిడ్ వార్నర్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి అగ్రస్థానంలో ఉన్నారు.కాగా, ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
20 బంతుల్లోనే అర్ధశతకం..వీడియో
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)