నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రెండో పెండ్లి చేసుకున్నారు. జర్నలిస్ట్ నిధి రజ్దాన్ను వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని వారు శనివారం సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించారు. 56 ఏళ్ల అబ్దుల్లా, 'ఎక్స్' (X) వేదికగా తమ ఫోటోలను పంచుకున్నారు. "నిన్న ఒక కొత్త ప్రయాణం మొదలైంది" అని పేర్కొన్నారు.
గతంలో పాయల్ అబ్దుల్లాతో ఆయనకు పెండ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వైవాహిక జీవితంలో పలు వివాదాలు రావడంతో వీరు 2011లో విడిపోయారు. తరువాత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ దంపతులకు విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరించింది. దీన్ని ఒమర్ అబ్దుల్లా సుప్రీం కోర్టులో సవాలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. విడాకులు మంజూరు చేయడానికి ఈ ఏడాది జూలై 31న అంగీకరించింది. దీంతో జర్నలిస్ట్ నిధి రజ్దాన్ను ‘జమ్మూ’ సీఎం ద్వితీయ వివాహం చేసుకున్నారు.






కామెంట్లు (0)