Magazines

దేశ ఐక్యత, సమగ్రత కోసం ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారు 

1 గంట క్రితం

Indira Gandhi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

- సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్

- కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుక 

నవతెలంగాణ-సత్తుపల్లి 

దేశ ఐక్యత, సమగ్రత కోసం ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.


ఇందిరాగాంధీ దేశానికి అందించిన విశేష సేవలు, దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన కృషిని స్మరించారు. ​దేశ ప్రగతికి ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రజాసేవ పట్ల చూపిన నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు మొహమ్మద్ కమల్ పాషా, పింగుల సామేలు, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దామెర రమేష్, మొహమ్మద్ షరీఫుద్దీన్, ఆంగోతు రామారావు, కౌన్సిలర్లు దూదిపాల రాంబాబు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, హాకీం, విరివాడ అపర్ణ, సలీమా బేగం, ఉప్పు నాగమణి, గొర్లమారి రామ్మోహనరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్