Magazines

సీఎం రేవంత్‌, ఆయన సోదరులపై విరుచుకుపడ్డ కేఏ పాల్‌

7 గంటల క్రితం

ka paul
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అవినీతి పాలన తారాస్థాయికి చేరిందని, ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈరోజు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు.

రేవంత్ రెడ్డి, ఆయన అన్నదమ్ములు.. ఏడుగురూ కలిసి లక్షల కోట్ల రూపాయల ఆస్తులను దోచుకున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారని కేఏ పాల్ పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నా ఇప్పటివరకు దీనిపై ఎలాంటి విచారణ చేపట్టకపోవడం దారుణమన్నారు. ఇటీవల నగరంలోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’ కార్యక్రమంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సదస్సు కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేశారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.


ఈ సమ్మిట్ పేరుతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలను పిలిపించి విలాసవంతమైన వేడుకలు నిర్వహించారని, ఇదంతా ప్రజల కళ్ల ముందే జరిగిందని ఆరోపించారు. అయితే కొన్ని మీడియా సంస్థలు ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు రాష్ట్రంలో ప్రజలకు కనీసం గుక్కెడు తాగునీరు కూడా అందించలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం, ఇలాంటి సదస్సులకు ప్రజాధనాన్ని వృథా చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. రేవంత్ రెడ్డి సర్కారు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్