Magazines

రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై పోలీసుల కాల్పులు

8 గంటల క్రితం

Key development in the Raptadu student attack case.. Police fire on the accused
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : రాప్తాడు పాఠశాల విద్యార్థినిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరారీలో ఉన్న నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులపై రాళ్లతో దాడికి యత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను అదుపులోకి తీసుకుని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


రాప్తాడు మండలం అయ్యవారిపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థినిపై ఆమె బంధువైన హేమంత్ పాఠశాల తరగతి గదిలో దాడికి పాల్పడ్డాడు. ఎలక్ట్రిక్ రంపంతో బాలిక తల, ముఖం, వీపు భాగాలపై దాడి చేయగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలికను తొలుత అనంతపురం ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పీఐసీయూలో చికిత్స పొందుతోంది.


నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. హేమంత్ ఆత్మకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. లొంగిపోవాలని పోలీసులు సూచించినప్పటికీ, అతను రాళ్లు విసురుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల కథనం. ఈ ఘటనలో కొందరు పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పోలీసులు సుమారు ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన హేమంత్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్