Magazines

పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత

15 గంటల క్రితం

Massive earthquake in Peru; magnitude 6.9 on the Richter scale
avatar
Kalluri Elender

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : దక్షిణ అమెరికా దేశమైన పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. రాజధాని లిమాతో పాటు పలు ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా లిమాలోని పార్లమెంట్ భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు. అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. జునిన్ ప్రాంతానికి సమీపంలో భూకంప కేంద్రం గుర్తించారు. భూమికి సుమారు 108 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్