Magazines

రష్మిక ‘ఓసేయ్ రాములమ్మ’ రీమిక్స్ సాంగ్ వచ్చేసింది..

18 గంటల క్రితం

osey Ramulamma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం



నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఓ ముత్యాల రెమ్మ.. ఓ మురిపాల కొమ్మ.. ఓ పున్నమి రెమ్మ.. ఓ పుత్తడి బొమ్మ ఓ రాములమ్మా.. ’ ఒకప్పుడు తెలుగు సినీ ప్రేక్షకులను, శ్రోతలను ఓ ఊపు ఊపేసిన పాట ఇది. ఏ ఫంక్షనైనా, జాతరైనా ఈ పాట తప్పకుండా వినిపించేది. ఇప్పుడు మరోసారి థియేటర్‌లు దద్దరిల్లేలా అలరించడానికి సిద్ధమైంది. రష్మిక ప్రధాన పాత్రలో రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మైసా’. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇందులోని ‘ఓసేయ్‌ రాములమ్మా’ అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ ఈ పాటను రాయగా, వందేమాతరం శ్రీనివాస్‌ ఆలపించారు. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్