నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్-భారత్ సంబంధాలు "హిమాలయాల వలె దృఢమైనవి, సముద్రమంత విశాలమైనవి" అని నేపాల్ ప్రధాన మంత్రి బాలేంద్ర షా అభివర్ణించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మొదటగా ఇండియా స్పందించి, తక్షణ చేయుత అందించిందని, భారత్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గంగానదిలో కలిసే హిమాలయ నదుల విషయంలో సామూహిక వాతావరణ చర్యలకు ఆయన పిలుపునిచ్చారు. సోమవారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ప్రతినిధి బృంద స్థాయి చర్చల అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో షా మాట్లాడారు., పరస్పర గౌరవం, విశ్వాసం, ప్రజా సద్భావనలే ద్వైపాక్షిక సంబంధాలకు పునాదులని నొక్కి చెప్పారు.
నేపాల్-భారత్ సంబంధాలు హిమాలయాల వలె దృఢమైనవి: నేపాల్ ప్రధాన మంత్రి
18 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)