Magazines

ఆలేరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి మంత్రులకు ఆహ్వానం

41 నిమిషాల క్రితం

Ministers invited
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 

ఈ నెల 27న ఆలేరు పట్టణంలో జరిగే మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరుకావాలని, రాష్ట్ర  రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లను  ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు, బీర్ల అయిలయ్య, నూతన చైర్మన్ సుదగాని మల్లేష్ గౌడ్ సోమవారం హైదరాబాదులోని మంత్రుల కార్యాలయాల వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.


ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గంలో రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా నూతన మార్కెట్ కమిటీ పనిచేయాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ల నియామకంతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.


ఈ ఆహ్వానంపై మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ కార్యక్రమానికి హాజరవుతామని తెలియజేసినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్