Magazines

సైనిక శిక్షణ విన్యాసాల్లో అపశృతి

1 గంట క్రితం

Mishap during military training exercises
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: సైనిక శిక్షణ విన్యాసాల్లో అపశృతి జరిగింది. ట్యాంకు ఢీకొట్టడంతో దాని కింద నలిగి ఇద్దరు సైనికులు మరణించారు. ఈ సంఘటనపై ఆర్మీ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హర్యానాలోని హిసార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Army Soldiers Killed) శనివారం సైనిక శిక్షణలో భాగంగా సుమారు 32 ట్యాంకులతో యుద్ధ విన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ధూళి గాలిలోకి లేచింది.వారిని వెంటనే హిసార్‌లోని మిలిటరీ ఆసుపత్రికి తరలించగా వారు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.


మరోవైపు ఆర్మీ అధికారులతో పాటు హిసార్‌ పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్