Magazines

నందమూరి కాలనీలో కార్డెన్ సెర్చ్.. 

52 నిమిషాల క్రితం

Cordon search
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

- ఐదు బైకులు సీజ్

- సీఐ నాగరాజు రెడ్డి 

నవతెలంగాణ - అశ్వారావుపేట

అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, నేరాల నివారణే లక్ష్యంగా అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని నందమూరి కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ సూచనలతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీలోని 120 ఇళ్లను పోలీసులు తనిఖీ చేశారు. 54 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 2 కార్లు కలిపి మొత్తం 60 వాహనాల పత్రాలను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని 5 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.


అలాగే ఓ బెల్ట్ షాపులో 64 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

ఈ కార్డెన్ సెర్చ్‌లో అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి, అశ్వారావుపేట , దమ్మపేట ఎస్‌హెచ్‌వోలు సాయి కిశోర్ రెడ్డి, రాజేష్ కుమార్, అదనపు ఎస్సై దేవ్ సింగ్‌తో పాటు అశ్వారావుపేట సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్