Magazines

కాంగ్రెస్‌ జెండా మోసినోళ్ళకు హ్యాండ్‌

1 గంట క్రితం

Congress flag
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

34 సంవత్సరాలు పార్టీ కోసం పని చేశా

కడ్తాల్ కాంగ్రెస్ లో నలుగురిదే పెత్తనం

గిరిజన నాయకులకు అన్యాయం

బీఆర్ఎస్ లో చేరనున్నట్లు హన్మ నాయక్ వెల్లడి

నవతెలంగాణ - కడ్తాల్ 

34 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన తగిన గుర్తింపు ఇవ్వడంలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమ నాయక్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. స్వచ్ఛ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత లేదన్నారు. పచ్చ కాంగ్రెసు నాయకులకు ప్రాధాన్యత ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు.


పార్టీ కోసం జెండా మోసిన వారికి పదవులు ఇవ్వకపోవడానికి తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోసం 2014 నుండి నేటి వరకు పనిచేశానని గుర్తు చేశారు. కడ్తాల్ మండలంలో ఆ నలుగురు నాయకులదే పై చేయి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఫోటోలకు ఫోజులిచ్చే నాయకులు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసం సుదీర్ఘంగా పనిచేసిన నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. గిరిజన నాయకులను పట్టించుకోకపోవడం వెనక అంతర్యం ఏమిటన్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి గిరిజన నాయకులను అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. త్వరలో మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీ ఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. మీరు వెంట రఘురాం రాథోడ్ బంజారా రాష్ట్ర అధ్యక్షులు, సురేష్ నాయక్ అధికార ప్రతినిధి ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్