Magazines

రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆర్ఎస్ఎస్ యత్నం

4 గంటల క్రితం

RSS attempt to undermine the Constitution
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ

నవతెలంగాణ-హైదరాబాద్: భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని, దేశంలో మనుస్మృతిని అమలు చేయాలని ఆర్ఎస్ఎస్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ ఆరోపించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఎస్ఐఆర్ (SIR) కు వ్యతిరేకంగా ఢిల్లీలోని సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.


ప్రస్తుతం దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అత్యంత కీలకమైన సమయం ఆసన్నమైందని ఎం.ఎ. బేబీ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక విలువలు, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడం నేటి తక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ పీఠికను పఠించడంతో ఈ నిరసన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఆందోళనలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్