నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన గోండియా జిల్లాలో.. ఇండిగో మహిళా ఉద్యోగిని వర్షా తుర్కర్ (35) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతడి భార్య మోనా అగర్వాల్ (41) ఈ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం.. మోనా అగర్వాల్ తన భర్తకు వర్షాతో ఉన్న సంబంధాన్ని సహించలేక కునాల్ కుంభల్కర్ సహాయంతో హత్యకు పథకం వేసింది. అనంతరం షారుఖ్ పఠాన్ ద్వారా రూ.13 లక్షలకు సుపారీ కుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుట్రలో భాగంగా ముగ్గురు దుండగులు నితేష్ కారును వెంబడించి, వర్షాను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మోనా అగర్వాల్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
ఇండిగో మహిళా ఉద్యోగి హత్య కేసులో సంచలన విషయాలు
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)