Magazines

యూఎస్ మధ్యంతర ఎన్నికల్లో 'స్పేస్ లేజర్లు' విఫలం: ఎలాన్ మస్క్

1 గంట క్రితం

'Space lasers' fail in US midterm elections: Elon Musk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా మధ్యంతర ఎన్నికలలో అందరూ ఊహించినట్లే ట్రంప్ మద్దతుదారులకు ప్రతికూలంగా ఫలితాలు వెలువడ్డాయి. ఈక్రమంలోనే ఎలాన్ మస్క్ ఆ ఫలితాలపై స్పందించారు. ఎన్నికలలో జోక్యం చేసుకుంటాయని తాను చెప్పిన 'స్పేస్ లేజర్లు' ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలో విఫలమయ్యాయని ఆయన చమత్కరించారు. రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా వందల మిలియన్ల డాలర్లు వెచ్చించిన ఈ బిలియనీర్, టెక్సాస్‌తో సహా పలు రాష్ట్రాల్లో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత 'X' వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుతం అంతరిక్షంలోని డేటా సెంటర్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి" అని పేర్కొంటూ మరో పోస్ట్ కూడా పెట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్