నవతెలంగాణ-హైదరాబాద్: సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్’ పుస్తకంపై బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటుంటారని.. మరి ఆమె ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు ఎన్నడూ నిజమైన ప్రేమ లేదని.. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణ సాధనలో ప్రజల త్యాగాలను, కేసీఆర్ నాయకత్వాన్ని విస్మరించే ప్రయత్నం చేస్తూ అబద్దాలను ప్రచారం చేస్తోంది. కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, పోరాటాలు, కేసీఆర్ నాయకత్వంలోని ఉద్యమ ఫలితమే స్వరాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఎవరి దయాభిక్ష కాదు.. ప్రజల పోరాటంతో సాధించుకున్న హక్కు. తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ చెరిపివేయలేదు’ అంటూ ఆయన కాంగ్రెస్‌పై మండిపడ్డారు.







కామెంట్లు (0)