Magazines

ముధోల్ లో రెండు ప్రమాదాల్లో ఒకే బస్సు ప్రయాణికులు

2 గంటల క్రితం

accidents
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు..
నవతెలంగాణ - ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో బుధవారం జరిగిన వేరు వేరు రెండు రోడ్డు ప్రమాదాల్లో ఒకే బస్సులో ప్రయాణించిన ప్రయాణికులో ఒకరి మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలైన సంఘటన పలు హృదయాలను కలచివేసింది. పూర్తి వివరాల్లోకెళ్తే.. బైంసా నుంచి నిజామాబాద్ కి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కల్తుర్తి గ్రామానికి చెందిన లక్ష్మి (68) వృద్ధురాలు బస్సు ఎక్కింది. అలాగే ఇదే బస్సులో ముధోల్  మండలంలోని ఆష్ట గ్రామానికి చెందిన ద్యావత్ పోశెట్టి అనే వృద్ధుడు ముధోల్ బస్టాండ్ లో బస్సు ఎక్కే క్రమంలో కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు.


దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. గాయాల పాలైన వృద్ధుడు ని అంబులెన్స్ లో భైంసా ఆస్పత్రికి తరలించారు‌‌. ఈ క్రమంలో బస్సులో ఉన్న ప్రయాణికులను ముధోల్ బస్టాండ్ లోని వదిలి, ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. ఇదే క్రమంలో వేరే బస్సు రావడానికి ఆలస్యం జరగడంతో స్వగ్రామానికి తొందరగా వెళ్లాలన్న ఆత్రుతతో ముధోల్ బస్టాండ్ నుండి నడుచుకుంటూ హెచ్ పీ పెట్రోల్ బంక్ వరకు లక్ష్మి అనే వృద్ధురాలు వచ్చింది. అక్కడ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని లక్ష్మి మృతి చెందింది. అయితే సంఘటన స్థలంలో వృద్ధురాలు వద్ద బస్ టికెట్ దొరకడంతో ముధోల్ సీఐ రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఎస్ఐ బిట్ల పెర్సిస్ బైంసా ఆర్టీసీ డిపోలో బస్సు టికెట్ ఆధారంగా విచారణ జరపడంతో ఈ విషయం బయటపడింది.


ఈ సంఘటన ప్రమాదవశత్తు జరిగినప్పటికీ ఓకే బస్సు లో ప్రయాణించిన వృద్ధురాలు మృతిచెందగా, మరో  వృద్ధుడు  అదే బస్సులో ఎక్కుతుండగా ప్రమాదానికి గురి అయ్యారు. రెండు సంఘటనలో ఒకే బస్సు ప్రయాణికులు కావటం దిగ్ర్భాంతికి గురిచేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్