Magazines

మదర్ థెరెసా ఇంజనీరింగ్ కళాశాలలో 'కోడ్ తాన్ @2K26' ఫైతాన్ ప్రోగ్రామింగ్ హ్యాకథాన్

1 గంట క్రితం

'Code Than @2K26' Phaitan Programming
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​మదర్ థెరెసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థుల కోసం 'కోడ్ తాన్ @2K26' ఫైతాన్ ప్రోగ్రామింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ​హైదరాబాద్‌కు చెందిన 'కోడ్ తంత్ర' ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏకధాటిగా 12 గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది. వివిధ విభాగాలకు చెందిన మొత్తం 265 మంది విద్యార్థులు ఈ ప్రోగ్రామింగ్ శిక్షణా కార్యక్రమంలో నాలుగు దశలలో పాల్గొన్నారు. కోడ్ తంత్ర నిపుణులైన ట్రైనర్స్ సి.హెచ్. చైతన్య, ఐ. స్వాతి, పి. హర్ష, కే. సురేష్‌ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించారు.


​ఆధునిక పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించడానికి అవసరమైన వివిధ సాంకేతిక నైపుణ్యాలను (టెక్నికల్ స్కిల్స్) ట్రైనర్స్ నేర్పించారు. శిక్షణ అనంతరం విద్యార్థులు తాము నేర్చుకున్న కోడింగ్ పద్ధతులను ఉపయోగించి అతి తక్కువ సమయంలో  విభిన్న ప్రాజెక్టులను విజయవంతంగా రూపొందించారు. ​ప్రాజెక్టుల రూపకల్పనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లు, ప్రోత్సాహక బహుమతులు అందజేసి అభినందించింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.


​తరగతి గది బోధనతో పాటు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి కాగానే విద్యార్థులు సులభంగా ప్రముఖ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు సాధించడానికి ఈ కోడింగ్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.


​ఈ కార్యక్రమంలో మదర్ థెరెసా విద్యాసంస్థల ప్రెసిడెంట్ చలసాని సాంబశివరావు, ​వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. ఉదయ్ కిరణ్ భార్గవ్ ఈ కార్యక్రమంలో ​సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ పి. మారేశ్వరరావు, ​ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ టి. రాఘవరాజు, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్