Magazines

చక్రిపురం కాలనీలో సీసీ రోడ్లకు శంకుస్థాపన

1 గంట క్రితం

Foundation stone laid for CC roads in Chakripuram Colony
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - నాచారం  : చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రిపురం కాలనీ రోడ్ నంబర్‌ వన్‌లో రూ.22 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పనులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గడ్డల పాండు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి సోమసాని అశోక్, ఉమ్మడి చర్లపల్లి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు నేమూరి మహేష్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు మొగిలి రాఘవరెడ్డి, సలహాదారులు సహదేవ్ గౌడ్, మురళి సార్, కమిటీ సభ్యులు రవీందర్ గంగపుత్ర, వెంకటేష్ గుప్తా, నాగరాజు గుప్తా, రాజు ముదిరాజ్, బీజేపీ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ గౌడ్, కాలనీ పెద్దలు నరేందర్ గౌడ్, రామ్ రెడ్డి, ఎలిసెట్టి వెంకటేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్