Magazines

ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు: హరీశ్‌రావు

48 నిమిషాల క్రితం

Farmers are facing difficulties due to government failure
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎల్‌నినో ఉందని ముందే తెలిసినా ప్రభుత్వం బొగ్గు నిల్వలు ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి వైఫల్యం వల్లే రాష్ట్రంలో విద్యుత్తు కోతల పరిస్థితి ఎదురైందన్నారు. దేవాదుల, కల్వకుర్తిలో నీళ్లు లిఫ్ట్‌ చేసి ఉంటే కరవే ఉండేది కాదని, ఎల్‌నినో ఉందని తెలిసినా నీళ్లు లిఫ్ట్‌ చేసి పెట్టుకోలేదన్నారు. తాగునీటి కొరత విషయంలో ప్రభుత్వానికి కార్యాచరణే లేదని విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్