Magazines

సింగరేణి ప్రభావిత గ్రామాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

5 గంటల క్రితం

cpim
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

- తెలంగాణ వ్యకాస డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ డిమాండ్

నవతెలంగాణ-సత్తుపల్లి 

సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం పిల్లి నాగమణి అధ్యక్షతన స్థానిక రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల)  భవనంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి మండల కమిటీ సమావేశంలో శ్రీనివాస్  మాట్లాడారు. సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఆర్వో  వాటర్ ప్లాంట్లు అనేక చోట్ల పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

​పాడైన ఆర్వో ప్లాంట్లకు వెంటనే మరమ్మతులు చేయించి, నిరంతరం శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, సింగరేణి నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లను పూర్తిస్థాయిలో ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలన్నారు. ​పలు గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు సగంలోనే ఆగిపోయి నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన నిర్మాణాలకు తక్షణమే నిధులు కేటాయించి, పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ​గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల సమస్యలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.


​ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు, అయినంపూడి సనందరావు, బండి వేలాద్రి, తడికమళ్ల రామకృష్ణ, బెజవాడ లక్ష్మీనారాయణ, మల్లాది వెంకట్, ఎలగం రాములు, సప్పిడి భాస్కర్, పరమేష్, తోటకూర వెంకటరావు, సరోజిని పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్