నవతెలంగాణ - భీంగల్
పట్టణంలో బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణ తేదీలను మున్సిపల్ పాలకవర్గం, సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ సంయుక్తంగా కలిసి నిర్ణయించాయి. బతుకమ్మ పండుగ ఈ నెల 17 శనివారం, దసరా పండుగ ఈ నెల 20న మంగళవారం జరుపనున్నట్టు కమిటీలు సంయుక్తంగా నిర్ణయించారు.
ఈ పండుగలను పట్టణ ప్రజలందరి భాగస్వామ్యంతో ఐకమత్యంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. పండుగల నిర్వహణ విజయవంతం కావడానికి పట్టణ ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్, పాలకవర్గ సభ్యులు, సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరస్పర సోదరభావంతో, సామాజిక ఐక్యతను చాటాలని కోరారు. పట్టణ ప్రజలందరూ పండుగల తేదీలను గమనించి, నిర్వహణకు తమ వంతు సహకారం అందించాలని మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ పాలకవర్గం, సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ వారు కోరారు.





కామెంట్లు (0)