Magazines

ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఖరారు

1 గంట క్రితం

ap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా మున్సిపల్‌, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ ను బుధవారం విడుదల చేశారు.ఏపీ లోని 13 నగరపాలక సంస్థలు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు. మూడు దశల‍్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100 అర్బన్ లోకల్‌ బాడీస్‌ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు. ఈనెల (అక్టోబర్) 28న ఎన్నికలు జరగనుండగా.. 30న ఫలితాలు వెల్లడికానున్నాయి.


షెడ్యూల్ ఇదే..


  • అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్లు

  • అక్టోబర్ 19న నామినేషన్ల స్క్రూటినీ

  • అక్టోబర్ 21లోపు నామినేషన్లు ఉపసంహరణ

  • అక్టోబర్ 28న ఎన్నికలు.. 30న ఫలితాలు

  • నవంబర్‌ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

  • నవంబర్‌ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు

  • నవంబర్‌ 26న తొలిదశ పంచాయతీ ఎన్నికలు

  • నవంబర్‌ 29న రెండోదశ పంచాయతీ ఎన్నికలు

  • డిసెంబర్‌ 2న మూడోదశ పంచాయతీ ఎన్నికలు

  • పంచాయతీలకు ఎన్నికల రోజే ఫలితాలు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్