Magazines

తానూర్ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి   

1 గంట క్రితం

issues should be resolved
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్            

నవతెలంగాణ - ముధోల్ 

హైదరాబాద్‌లోని నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్  అభిలాష అభినవ్ ను ముధోల్  ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ముధోల్ నియోజకవర్గంలోని తానూర్ జూనియర్ కళాశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన ఇంటర్మీడియట్ గెస్ట్ ఫ్యాకల్టీని త్వరితగతిన నియమించాలని కోరారు.


విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆధునిక సౌకర్యాలతో కూడిన కళాశాల భవనాన్ని మంజూరు చేసి, గెస్ట్ ఫ్యాకల్టీ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఇందుకు డైరెక్టర్  సానుకూలంగా స్పందించిన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీటీసీ పట్టేపూర్ సతీష్ రెడ్డి ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్