నవతెలంగాణ-మిడ్జిల్
పశువైద్య శిబిరాలను పశువుల దారులు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి డాక్టర్ శివరాజ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మంగలిగడ్డ తండాలో పశువైద్య శిబిరాన్ని పశు వైద్య-పశుసంవర్ధక శాఖ, తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సమన్వయంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజన్లో పశువులకు వచ్చే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు గర్భకోశ వ్యాధుల నివారణ కార్యక్రమంతో పాటు 52 పాడి పశువులకు చికిత్సలు, 74 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. వ్యవసాయంతో పాటు పాడి అభివృద్ధి చేసుకోవాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జర్పుల చందులాల్, గ్రామ పెద్దలు, పాడి రైతులు జె.రమేష్ నాయక్, జె. భీమ్లా నాయక్, నాను నాయక్, మక్త నాయక్, లోక్య నాయక్, హుసేన్, పశువైద్య సిబ్బంది- సత్యం ,దామోదర్ ,సత్యం, గోపాల మిత్రులు మల్లేష్,రామకృష్ణ,నర్సింలు, యాదగిరి,వేణుగోపాల్ చారీ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)