Magazines

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

5 గంటల క్రితం

Cmrf
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

పేద ప్రజల అత్యవసర సమయాల్లో ఆస్పత్రిలో చికిత్సకై ప్రభుత్వం బాధితులకు సీఎంఆర్ఎఫ్‌ నిధులు అందించి కొండంత అండగా నిలుస్తోందని సర్పంచ్‌ ఉషా సంతోష్‌ మేస్త్రీ అన్నారు. శనివారం బాధితులకు విడుదలైన చెక్కులను వారు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల మంజూరుకు జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష‍్మీకాంతారావు ప్రత్యేక కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, సంతోష్ మేస్త్రి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్