Magazines

అధికారం బహుజనులదే కావాలి

1 గంట క్రితం

Bahujana
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం

బహుజన సమాజ్ పార్టీ జుక్కల్ ఇంచార్జ్ ఎర్ర గోపాల్

నవతెలంగాణ-మద్నూర్

రాజ్యాధికారం బహుజనులదే కావాలని అప్పుడే బహుజనులకు న్యాయం చేకూరుతుందని బహుజన పార్టీ జుక్కల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎర్ర గోపాల్ పిలుపునిచ్చారు. అక్టోబర్ 9 వ తేదీన బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్ లో కన్షిరాం 20వ వర్ధంతి బహుజన రాజ్యాధికార సంకల్ప సభ పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రతి మండల కేంద్రంలో కన్సీరామ్ 20వ వర్ధంతి గోడ ప్రతులను విడుదల చేస్తూ మండల కేంద్రాల్లో అతికించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ జై భీమ్ మిత్రులకు సూచన ఇస్తూ అదేవిధంగా మాన్యవార్ కన్షీరామ్ అంటే ఎవరు ఆయన త్యాగం ఏమిటి రాజకీయ ఉద్యమం ఏ విధంగా చేపట్టారు బీసీ రిజర్వేషన్ల కోసం చరిత్రత్మక పోరాటం ఆయన సంకల్పం రాజ్యాధికార మాస్టర్ కి అందించిన సేవలు మన కర్తవ్యం ఏమిటని వాటి గురించి ఈ వర్ధంతి సభలో ముఖ్యంగా ఆయన జీవిత చరిత్ర వివరించడం జరుగుతుందని బహిరంగ సభ నిర్వాహక కమిటీ ప్రముఖులు


ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జిలు సాలం బిన్ హసన్, తుడిచెర్ల సంజయ్, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జీలు అడ్వకేట్ నీరడీ ఈశ్వర్, ఇబత్ వార్ రోహిదాస్, నిజామాబాద్ పార్లమెంట్ ఇన్చార్జులు గండికోట రాజన్న, చిర్రా శంకర్, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ అక్కి బాలకిషన్, పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసీ రవీందర్, వీరితోపాటు దుర్గం తుకారం ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా అధ్యక్షులు, అడ్వకేట్ జగన్మోహన్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు, సింగాడే పాండు నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు, మలోత్ హరిలాల్ నాయక్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, కొమ్మాట అశోక్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, బొల్లం పెళ్లి సంపత్ కుమార్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు, ముల్కల రాజేంద్రప్రసాద్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, ఈ విధంగా ప్రముఖుల ఆధ్వర్యంలో నిర్వహించే కన్సీరాం 20వ వర్ధంతి కార్యక్రమం విజయవంతానికి అన్ని మండల కేంద్రాల్లో గోడ ప్రతులు, కరపత్రాలు, విడుదల చేస్తూ బహుజనులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ గోడ ప్రతుల విడుదల కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్