నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే ఆదివారం ముంబైలో వ్యతిరేకంగా సంయుక్త నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ....ప్రజాస్వామ్య సంస్థలను, ఎన్నికల ప్రక్రియలను, పౌరుల రాజ్యాంగ హక్కులను బలహీనపరిచే ప్రయత్నాలకు ఇది ఒక(సర్) సామూహిక ప్రతిస్పందన అని అన్నారు.
"దేశంలో నెలకొన్న హిట్లర్ పాలనకు, ఎన్నికలను హైజాక్ చేయడానికి, ఎన్నికల సంఘాన్ని, సుప్రీంకోర్టును తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి, నియంతృత్వం నడపడానికి, ఓట్లను దొంగిలించడానికి, ఎన్నికలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి వ్యతిరేకంగా ఈ భారీ నిరసన చేపట్టామని తెలిజయేశారు.. 1857 నాటి తిరుగుబాటు మాదిరిగానే, వీటన్నింటికీ వ్యతిరేకంగా ఇది ఒక తిరుగుబాటు," అని ఆయన విలేకరులతో అన్నారు.





కామెంట్‌లు (0)