Magazines

వికాస్ ఒకేషనల్ జూ. కళాశాలను ప్రారంభించిన మంత్రి దామోదర

1 గంట క్రితం

Minister Damodar
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సంగారెడ్డి 

సంగారెడ్డి పట్టణంలోని వికాస్ ఒకేషనల్ జూనియర్ కళాశాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ కళాశాలలోని ఒకేషనల్ ట్రైనింగ్ విభాగాలను పరిశీలించారు. కాలేజీలో కోర్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖి గా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా,  వైద్య రంగాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

రాష్ట్రంలో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కోసం అవసరమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఐటిఐ లను ఆధునికరిస్తున్నామన్నారు. నర్సింగ్ విద్యార్ధులకు వివిధ దేశాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, జపనీస్ లాంగ్వేజ్ లలో ప్రభుత్వం శిక్షణ ఇస్తున్నామన్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాన్ని, భాషా ప్రావీణ్యత ను పెంచుకొని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకాంక్షించారు. ఆధునిక సౌకర్యాలతో ఒకేషనల్ కళాశాలను ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్