Magazines

మారిన కళ్యాణ మండపం రూపురేఖలు

58 నిమిషాల క్రితం

Development
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ–నర్సింహులపేట 

మండలంలోని పడమటిగూడెం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం ముందు ఉన్న కళ్యాణ మండపం పరిసరాలకు ఇక కొత్త రూపు రానుంది. వర్షాలు కురిసినప్పుడు బురద, చెత్తాచెదారం పేరుకుపోవడంతో భక్తులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కళ్యాణ మండపం చుట్టూ సీసీ నిర్మాణ పనులను సర్పంచ్‌ జక్కుల ఉప్పలయ్య యాదవ్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో శాంతి పూజలు, హోమాలు, శ్రీరామనవమి వేడుకలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.


గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తూ, గ్రామాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సర్పంచ్‌ తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ చిమ్ముల నవీన్‌రెడ్డి, వార్డు సభ్యులు యకయ్య, వెంకటమ్మ, సునీల్‌రెడ్డి, జక్కిలత, మురళి, తెప్ప సుజాత, యాకయ్య, జొన్నగడ్డ యాకయ్య, మాజీ ఎంపీటీసీ పాతూరి మధుకర్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ అక్కిరెడ్డి వెంకటరెడ్డి, గ్రామ పెద్దలు దాసరోజు కనకాచారి, గువ్వ వెంకన్న, విజయ్‌పాల్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ఉపేందర్‌గౌడ్‌, ఊదరి యాకన్న, సింహాద్రి, వీరారెడ్డి, లింగారెడ్డి, సోమిరెడ్డి, అశోక్‌రెడ్డి, ఉప్పలయ్య, దేశగాని వెంకన్న, సురేష్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, జక్కి సురేష్‌, అక్బర్‌, అర్వపల్లి నూకల లింగయ్య, బుద్ద బిక్షం తదితర మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్