Magazines

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం.!

58 నిమిషాల క్రితం

Ippa Mondaiah
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య

నవతెలంగాణ-మల్హర్ రావు

మండలంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిద్ధమైనట్లుగా పిఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య తెలిపారు. ఆదివారం సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. దసరా అనంతరం ధాన్యం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లుగా చెప్పారు. ఆలోగా కేంద్రాల ఏర్పాటు చేసి వసతులు కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ ఖరీఫ్ లో 1.60.000 లక్షల క్వింటాళ్లు కొనుగోలుకు లక్ష్యం పెట్టుకొన్నట్లుగా తెలిపారు. గతేడాది ఖరీఫ్ లో 1.25.152.40 లక్షల క్వింటాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.


2,015 మంది రైతులకు రూ.29,89,05.604 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లుగా తెలిపారు. గతంలో సొసైటీ ఆధ్వర్యంలో 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 17 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఉన్నతాధికారులకు విన్నవించినట్లుగా తెలిపారు. ప్రభుత్వం చెప్పిన విధంగా ఏడురకాల సన్నాలు సాగుచేసిన ధాన్యానికే బోనస్ చెల్లించనుందన్నారు. అందులో బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జైశ్రీ రామ్ సెగ్మెంటల్, కెఎన్ఎం 1638, డబ్ల్యూ జీఎల్ 44, కెఎన్ఎం 7715 అనే రకాల సన్న వడ్లుకు బోనస్ వస్తుందన్నారు. ప్రతి కేంద్రంలో ప్యాడీ హస్కల్, గ్రెయిన్ కాలిపవర్(డయల్ మైక్రో మీటరు) యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు.


కేంద్రాల్లో టార్పాలిన్లు, తేమ శాతాన్ని కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు, సంచులు అందుబాటులో ఉంచుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్