Magazines

శంషాబాద్‌లో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

1 గంట క్రితం

Indigo
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌: పుణె నుంచి శంషాబాద్‌ వస్తున్న ఇండిగో విమానాన్ని శంషాబాద్‌లో ఓ పక్ష‍ి ఢీకొట్టింది. దీంతో ఇండిగో 6ఇ352 విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. అయితే.. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్‌ సూచనతో విమానాన్ని నిపుణుల బృందం తనిఖీ చేసింది. విమానం చండీగఢ్‌ వెళ్లాల్సి ఉండగా అధికారులు.. ఆ సర్వీసును రద్దు చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్