Magazines

సింగీతానికి సినీ ప్రముఖుల నివాళి

1 గంట క్రితం

Sangeetham Sinivasa Rao
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ప్రముఖ దర్శకుడు, మేధావి సింగీతం శ్రీనివాసరావు (95) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, అక్టోబర్ 3న కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వినూత్న కథనాలు, సృజనాత్మక దర్శకత్వ ప్రతిభతో ఇండియన్ సినిమాపై చెరగని ముద్ర వేసిన సింగీతం మృతి పట్ల యావత్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కమల్ హాసన్, ఎస్.ఎస్. రాజమౌళి వంటి అనేక మంది ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శ్రద్ధాంజలి ఘటించారు.

సింగీతంతో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న లోకనాయకుడు కమల్ హాసన్ భావోద్వేగభరిత నివాళి అర్పించారు. సింగీతం స్ఫూర్తిని, ఆయన యువతత్వాన్ని గుర్తుచేసుకుంటూ ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేశారు. "సింగీతం గారు తన యవ్వనంలోనే, తన యవ్వనంతో పాటే స్వేచ్ఛగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ఆయన యువస్ఫూర్తి అందరికీ వ్యాపించలేదు. ఆయన చేయి పట్టుకుని నడిచిన మిత్రులలో, శిష్యులలో నేను ఒకడిని" అని కమల్ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్