Magazines

వెల్మలపల్లి ప్రాథమిక పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభం

56 నిమిషాల క్రితం

Cm Break fast
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

సీఎం రేవంత్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాలతో హెరామ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని మంగళవారం తాడిచెర్లలోని వెల్మలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ బండి స్వామి, వార్డు సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులకు పౌష్టికమైన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రత, పాఠశాల హాజరు , విద్యా ప్రగతిని మెరుగుపరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పమ్మిడి నిరంజన్ రావు, చల్ల మహేందర్, ఉపాధ్యాయులు సురేష్, గంగరాజు, సిఆర్పీ సమత, పూర్వ విద్యార్థులు రాగం అనిల్, కుక్కడపు వెంకటేశ్వర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్