- రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య
నవతెలంగాణ - అశ్వారావుపేట
నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నల్గొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య పిలుపునిచ్చారు. మహాసభల విజయాన్ని కాంక్షిస్తూ తెలంగాణ రైతు సంఘం అశ్వారావుపేట మండల కమిటీ సమావేశాన్ని మడకం నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగ సంక్షోభం, పంటలకు గిట్టుబాటు ధర, సాగునీరు, ఎరువులు, విత్తనాల సమస్యలపై మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతులను సమీకరించి పోరాటాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఏఐకేఎస్ మహాసభలు దిశానిర్దేశం చేయనున్నాయని పేర్కొన్నారు. నల్గొండలో జరిగే జాతీయ మహాసభలకు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశం లో రైతు సంఘం మండల నాయకులు సీసం రాంబాబు,సంతపురి చెన్నారావు,తుట్టి వీరభద్రం,శాంతి పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)