Magazines

హార్ముజ్ జలసంధిలో భారతీయ నౌకపై దాడి

57 నిమిషాల క్రితం

HORMUZ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: హార్ముజ్ జలసంధిలో మరోసారి భారతీయ నావికులు ఉన్న నౌకపై దాడి జరిగింది. పనామా జెండా కలిగిన ఎంటీ ఆన్ పీస్ నౌకపై మంగళవారం ఒక ప్రొజెక్టైల్‌తో దాడి జరిగింది. ఈ దాడిలో గాయపడిన 12 మంది సిబ్బందిలో 11 మంది భారతీయులే ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


ఒమన్ తీరానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన నావికుల్ని ఒమన్ అధికారుల సహాయంతో నౌక నుంచి తరలించి ఖసబ్ ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించారు. నౌకలో 17 మంది భారతీయులతో సహా మొత్తం 19 మంది సిబ్బంది ఉన్నారు.


వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. భారతీయ నావికుల్ని తరలించడానికి సహకరించిన ఒమన్ అధికారులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ థాంక్స్ తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్