Magazines

నారాయణపురంలో వరి పంటను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

59 నిమిషాల క్రితం

inspect
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట మండలం నారాయణపురం, అశ్వారావుపేట, తిరుమలకుంట క్లస్టర్ల పరిధిలో సాగవుతున్న వరి పైరు ను స్థానిక వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల బృందం మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పలు పొలాల్లో ఆకుమాడు తెగులు బీఎల్బీ (బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్) లక్షణాలను గుర్తించింది. తెగులు వ్యాప్తికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు. తెగులు సోకిన పొలాల్లో అధిక మోతాదులో యూరియా, నత్రజని ఎరువులు వినియోగించవద్దని, పొలంలో తేమను సమతుల్యంగా నిర్వహించాలని తెలిపారు.


తెగులు తీవ్రతను బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే స్ట్రెప్టోసైక్లిన్‌ వంటి మందులను సిఫారసు చేసిన మోతాదులో వినియోగించాలని, కాసుగామైసిన్‌ 3 శాతం ఎస్‌ఎల్‌ను కూడా వ్యవసాయ అధికారుల సూచన మేరకు పిచికారీ చేయవచ్చని తెలిపారు. రైతులు తమ పొలాలను తరచుగా పరిశీలిస్తూ, ఆకులపై మచ్చలు, మెడ భాగంలో నల్లటి మచ్చలు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా వరి పంటలో ఆకుమాడు తెగులు వ్యాప్తిని నియంత్రించకోవచ్చని సూచించారు. ఈ పరిశీలనలో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ రాంప్రసాద్‌, డాక్టర్ నీలిమ, డాక్టర్ శ్రీజన్‌, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావుతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్