Magazines

అండర్‌ - 20 కబడ్డీ పోటీలకు ఆహ్వానం

1 గంట క్రితం

kabaddi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్న అండర్‌ - 20 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సర్వం సిద్ధమవుతోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలు ఇండోర్‌ మైదాన క్రీడా ప్రాంగణంలో జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం జిల్లా టీపీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, జిల్లా కలెక్టర్‌ అంకిత్‌, జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజులను స్వయంగా కలిసి పోటీల ఆహ్వాన పత్రికలను అందజేశారు.


రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యువ క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు సహకరించి భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్