నవతెలంగాణ - భీంగల్
పట్టణంలోని పిఎం ఎస్ హెచ్ ఆర్ ఐ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి 260 ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీలను విద్యార్థినీ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతి విద్యార్థి ప్రభుత్వం అందజేస్తున్న ఈ సేవలను వినియోగించుకొని చదువులో రాణించాలని, డిక్షనరీలను వినియోగించుకొని ఇంగ్లీషులో మంచి పట్టు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి డి.స్వామి, లింబాద్రి, వాసుదేవ్, భుమేశ్వర్, రాజ్ కుమార్, తిరుపతి, తదితర సిబ్బంది, పాల్గొన్నారు.






కామెంట్లు (0)