Magazines

వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం.. 

1 గంట క్రితం

Lakshmi Narasimha Swamy..
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

- మహా అన్నదానాన్ని ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్

నవతెలంగాణ - రుద్రంగి

రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వేదమంత్రోచ్ఛారణల మధ్య కనులపండువగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.


ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అన్నదాత లింగాల వెంకటేశ్వర రావు సహకారంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం భారీ ఎత్తున మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించి, భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.


భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీని, అన్నదాతను ఆయన అభినందించారు. ఈ జాతర ఉత్సవాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, బీజేపీ నాయకులు చెన్నమనేని వికాస్ రావు, గ్రామ సర్పంచ్ గండి నారాయణ తదితర ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు ఆలయ కమిటీ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శించుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్