నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆత్మ కమిటీ చైర్మన్గా ఇటీవల ఎన్నికైన పిక్క శ్రీనివాసును, ఆలేరు పట్టణంలో ఆదివారం రైల్వే గేట్, అమరవీరుల చౌరస్తా వద్ద, మలిదశ ఉద్యమకారులు పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. రైతుల అభ్యున్నతి కొరకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మలిదశ ఉద్యమకారులు జంపాల శ్రీనివాస్, మొరిగాడి వెంకటేష్, ఎర్ర జాన్సన్, ఆడెపు బాలస్వామి, రచ్చ రామ్ నరసయ్య, మొరిగాడి అశోక్, పాషికంటి శ్రీనివాస్, కుళ్ళ నరసింహులు, కళ్ళేపు రాజు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)