గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ
నవతెలంగాణ– నేరడిగుండ
సిరికొండ మండలంలోని ఫకీరా నాయక్ తండాలో జగదాంబ దేవి ఆలయంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించగా, గ్రామస్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాథోడ్ భికూ, సరోజ బాయి, గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిశారు. గ్రామంలో నెలకొన్న అభివృద్ధి అవసరాలను వివరించగా, గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని ఆయన పేర్కొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)